సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలిచినా గెలవకపోయినా ఏడాదికొక సూపర్ స్టార్ ను తయారు చేస్తోంది. వాళ్లు కూడా ఇండియన్ ప్లేయర్స్ అవటం నిజంగా మంచి విషయం. మూడేళ్లుగా సన్ రైజర్స్ వస్తున్న టాలెంటెడ్ ప్లేయర్స్ ని చూస్తుంటే ఈ విషయం చెప్పొచ్చు. మూడేళ్ల క్రితం అభిషేక్ శర్మను తమ ఓపెనర్ గా మార్చుకుని సంచలనాలు సృష్టించటం మొదలుపెట్టిన సన్ రైజర్స్.. రెండేళ్ల క్రితం నితీశ్ కుమార్ రెడ్డి లాంటి టాలెంట్ ను ఫైండ్ అవుట్ చేసి మిడిల్ ఆర్డర్ ను స్ట్రెంతెన్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇయర్ అలా సన్ రైజర్స్ కి దొరికిన తురుపుముక్క అనికేత్ వర్మ. జస్ట్ మూడు మ్యాచులు ఆడాడు అంతే ఐపీఎల్లో. వయస్సు 23 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ కి ఆడుతూ ఉంటాడు మాములుగా. గతేడాది మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో భోపాల్ లెపార్డ్స్ తరపున ఆడి టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేవలం 6 మ్యాచుల్లోనే 273పరుగులు చేశాడు. అందులో 41బంతుల్లోనే బాదిన సెంచరీ కూడా ఉంది. అలా సన్ రైజర్స్ సెలక్టర్స్ దృష్టిలో పడిన అనికేత్ వర్మను గతేడాది జరిగిన మెగా ఆక్షన్ లో 30 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంది సన్ రైజర్స్. ఇప్పుడు అతనే కాటేరమ్మ కొడుకుల్లాంటి ప్లేయర్లు విఫలమైన చోట కూడా ఏదో పది ఇరవై ఏళ్లు ఎక్స్ పీరియన్స్ ఉన్నవాడిలా ఆడేస్తున్నాడు . నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హెడ్, క్లాసెన్ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయని చోట అనికేత్ వర్మ ఒక్కడై పోరాడాడు. 41 బాల్స్ లో 5 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో 74పరుగులు చేశాడు అనికేత్. స్ట్రైక్ రేట్ 180. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 3 మ్యాచ్ ల్లో 205 స్ట్రైక్ రేట్ తో 12 సిక్సర్లు బాది మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ లా కనిపిస్తున్నాడు అనికేత్. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కొంటున్న విధానం మైండ్ బ్లోయింగ్ అసలు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను టార్గెట్ చేసి నాలుగు సిక్సులు కొట్టి గిఫ్ట్ ఇచ్చాడు అనికేత్. సన్ రైజర్స్ కి మిడిల్ ఆర్డర్ లో కొండంత అండగా నిలుస్తూ టీమ్ ను నిలబెట్టడంతో పాటు రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన సన్ రైజర్స్ ను తిరిగి గాడిన పెట్టడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడు.